Tuesday, 8 February 2011

నా స్వయంవర గా(బా)ధ

'You have to spare one Sunday evening dear' - నాన్న. ఎందుకూ అన్నట్టు సగం భయపడుతూనే నేనో లుక్కు. 'స్వయంవరం' - నాన్న. గుండె గుభేలు.

నా తోటి వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని తల్లులు/తండ్రులు అయిపోయారన్న సంగతి నేను పట్టించుకోకపోయినా, మా నాన్న ఈ విషయం మర్చిపోలేదు. ఏదోటి చేసి సుఖంగా బ్రతుకుతున్న నన్ను సంసార సాగరంలోకి నెట్టేద్దామని శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటారు.

అందులో భాగమే ఈ స్వయంవరం. ఇలాంటి వాటి గురించి పేపర్లో చదివి ఆ అభాగ్యులను తలుచుకుని నవ్వుకోటమే తప్ప, నెనూ వళ్ళల్లో ఒకరిని అవుతానని యేనాడూ అనుకోలేదు సుమీ. 'చచ్చింది కోడి' అని మనసులో అనుకుని, ఫ్రీగా ఫుడ్డు పెడుతున్నందుకు ఈ మాత్రం చెయ్యచ్చులే అని తలూపాను.

ఇంతలోకి ఆ 'Sunday Evening' రానే వచ్చింది. ప్రతి రోజులాగా jeans వేసుకుంటే స్వయంవరానికి వేంచేసే వధూవరులూ, వారి తల్లిదండ్రులూ బెదిరిపోతారని, వెతికి మరీ BC కాలం నాటి కుర్తీ ఒకటి తగిలించుకుని బయలుదేరా.

కారు తోలుంతున్నంత సేపూ నా మనసులో ఏవో ఆలోచనలు, అనుమానాలూ. వేలం పాటా, మేకల సంతా, ఇవే గుర్తుకొస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాదంతా బిర్యానీ లాగించి తన్నిపెట్టుకుని పడుకుంటున్న టైములో మేము మాత్రం trafficలో గంటసేపు ఈదుకుంటూ స్వయంవర ప్రాంగణానికి చేరుకున్నాం.

కారు park చేసి కిందకి దిగగానే అందరి చూపూ నా మీదే ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు. registration counter దగ్గర మా నాన్న కుస్తీ పడుతూండగా, నిలువు బొట్టు పెట్టుకుని, సఫారీ సూటు వేసుకున్న ఓ పెద్దాయన మెల్లగా నడుచుకుంటూ మా దగ్గరకి వచ్చాడు. 'మీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా?' నాకు నవ్వూ ఆశ్చర్యం, రేండూ ఒకే సారి పోటీ పడి మరీ వచ్చాయి. ఏమనాలో తెలీక మా అమ్మ నా వైపు చూపించింది, పై నించి కింద దాకా నిశితంగా పరిశీలించి 'ఆహా బ్రహ్మాండం' అని పాసు మార్కులు వేసాడాయన. ఇంకా interrogation చేసేలోపు మా నాన్న వచ్చి 'మా అమ్మాయి హైదరబాదులోనే ఉంటుందండీ' అని ఆ పెద్దాయనకి షాకు ఇవ్వటంతో ఆయన నన్నూ మా నాన్ననీ అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

ఈ తతంగమంతా ఎవరన్నా చూసారేమోనని ఇబ్బందిగా అటూ ఇటూ చూస్తూ అలాగే నిలబడ్డాను. ఒక గంట బయట ఎండలో నించోబెట్టి పక్కనే ఉన్న ఓ పురాతన auditoriumకి తోలారు మా అందరినీ. కూర్చుంటే విరిగిపోటానికి రెడీగా ఉన్న సీట్లల్లో ఇరుక్కుని అటూ ఇటూ మెసులుతూ ఇంకో గంట కాలక్షేపం చేసాక స్పీకర్లూ మైకూ టెస్టింగు చేసుకుని నిర్వాహకులు స్టేజీ ఎక్కారు. అప్పుడు ఆట మొదలైంది, నాకు మిస్టరీ వీడింది.

"Prospective brides and grooms" ఫోటోలు ఒక తెరమీద వేసి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, అనగా "Bio data" చదవసాగారు. నచ్చినవాళ్ళు సదరు అమ్మాయి/అబ్బాయి profile number/details రాసుకుంటున్నారు. నా నంబరు దగ్గరపడుతుంటే నాకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మొత్తానికి కనీ కనిపించకుండా నా ఫోటో వేసి, వినీ వినిపించకుండా ఏదో గొణిగి next profileకి వెళ్ళిపోయారు. అసలు నేను ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో, ఇదేం స్వయంవరమో అర్ధంకాక అలాగే బిక్కచచ్చి కూర్చున్నా. నోరు తెరిస్తే నా ముందున్నాయన గుర్రుమని నాకేసి చూస్తున్నాడు. So ఆ స్వతంత్రం కూడా లేకుండా పోయింది. మెల్లి మెల్లిగా నా ఇంద్రియాలు ఒక్కొక్కటీ పని చెయ్యటం మానేస్తున్నాయి. ఇంతలో కార్యక్రమం నిర్వహించటానికి డబ్బులిచ్చిన పెద్దమనిషి స్టేజి ఎక్కి మైకు అందుకున్నాడు. 'ఆహా మన కులం అదీ, ఇదీ. వీడు మనవాడు, వాడు మనవాడు. వీళ్ళని చూసి మనం గర్వపడాలి' అని ఇద్దరు రౌడీలు, ముగ్గురు రాజకీయ నాయకుల పేర్లు చదివాడు. దానితో, పోకిరిలో మహేష్ బాబు అన్నట్టు, దిమ్మ తిరిగి mind block అయ్యి, వెంటనే అక్కడనించి బయట పడ్డాము

మైకు హోరుకి తలవాచిపోయి, కూర్చునీ కూర్చునీ కాళ్ళు పీక్కుపోయి, ఒక్కసారే బయట గాలి తగలగానే ప్రాణం లేచివచ్చింది. ఆకలి మాడుతుండటంతో దగ్గర్లో ఉన్న హోటలుకెళ్ళి కూర్చున్నాం. ఒక్క సారి చుట్టూ పరికించాను. అక్కడ నన్నెవరూ చూడట్లేదు, నా గుణగణాలు బేరీజు వెయ్యట్లేదు. హమ్మయ్య అని మనసులో అనుకుని సుష్టుగా భోంచేసి, బిల్లు కట్టి, బయటకొచ్చి మెల్లగా వీస్తున్న శీతగాలిలో ఒక్కసారి మనసారా ఊపిరి పీల్చుకుని, ఇంకోసారి ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని ఒట్టు పెట్టుకుని, ఇంటి మొహం పట్టాను.

8 comments:

tankman said...

haha ..బాగుంది స్వయంవరం ...పాపం కదలడానికి లేదు, మాట్లాడటానికి కూడా లేదన్నమాట ...బాధపడకు...కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయంటారు .నీది చాలా బెటర్ మా ఫ్రండ్ ఇలాంటి ఒక స్వయంవరానికి వెళ్లి powerpoint presentation ఇచ్చాడుట వాడి మీద, వీడు మా project seminar ఇవ్వడానికే చాలా టెన్షన్ పడ్డాడు...మరి presentation ఏమి ఇచ్చాడో ఎలా ఇచ్చాడో కానీ ...మొత్తానికి పెళ్లి మటుకు అయిపొయింది :)

good luck next time :)

Prasanna Dommu said...

Sanju,I hope there wont be a next time :|

Sri Harsha said...

Ilanti sahasalu enduku talli?

tankman said...

@ప్రసన్న ... సాహసం షాయవో డింభకి ...రాకుమారుడు లభించునులే!! ( పాతాళ భైరవి డైలాగ్ గుర్తుందా ) :)

పరిమళం said...

:) :)

Prasanna Dommu said...

Harsha: చెప్పాగా, ఫ్రీగా ఫుడ్డు పెడుతున్నారు కదా. తప్పలేదు

Sanju: నా ముఖారవిందానికి రాకుమారుడు కూడానా....!

పరిమళంగారూ: నా అవస్థ చూస్తే ఎవరికైనా నవ్వే వస్తుంది సుమీ, ఎమంటారు..?

Satyadeep said...

vaaarnaayanoo ilaa kooda svayamvaralu jarugutayani ippude telisindi :))
nenu inka nee post title chadivi evaranna rakumarulu mee intiki vasthe nuvvu select chesukovatamemo anukunna old style lo :)

Prasanna Dommu said...

old is gold ani, ala old style aite brahmandanga undedi. nenuu raakumari style lo feel ayyedanni. kani naa kharma kaali, punyam puchchi, ee kaalam swayamwaramlo participate cheyyalsi vachindi